ఇలాంటి నేతలను గెలిపిస్తే ప్రజలకు ఇంకే తాగిస్తారో!: ప్రకాశ్ రాజ్

  • లీటరు పాలు 81 మంది చిన్నారులకు పంపిణీ  
  • యూపీలో విస్మయకర ఘటన
  • ట్విట్టర్ లో స్పందించిన ప్రకాశ్ రాజ్
ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో ఒక లీటరు పాలను బకెట్ నీటిలో కలిపి 81 మంది చిన్నారులకు పంపిణీ చేయడం పట్ల నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ట్వీట్ చేశారు. "ప్రియమైన భక్తులారా, ఇలాంటి నేతలను ఎన్నుకుంటే వీళ్లేం తాగిస్తారో మీకేమన్నా ఐడియా ఉందా? మీ ఇష్టం వచ్చింది ఊహించుకోవచ్చు. టేస్ట్ ద థండర్" అంటూ తనదైన శైలిలో స్పందించారు. వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ గోమూత్రం విశిష్టత గురించి చెబుతున్న వీడియోను కూడా ప్రకాశ్ రాజ్ తన ట్వీట్ కు జోడించారు.
Go Back to Shorts
Uttar Pradesh
School
Milk
Children
Prakash Raj

More Telugu News